Mayonnaise ban | తెలంగాణలో మయోనైజ్ నిషేధం..
Mayonnaise ban | తెలంగాణలో మయోనైజ్ నిషేధం..
కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర సర్కారు
వెంటనే ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ
Hyderabad : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్న మయోనైజ్‌ను ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో చర్చిస్తూ.. హోటళ్లలో తనిఖీలు, నియంత్రణ కోసం నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీల పని తీరును సమావేశంలో మంత్రి ఆరా తీశారు. వివిధ రకాల ఆహార పదార్థాలతో కలిపి తినే మయోనైజ్‌ను కల్తీ ఎగ్స్‌తో, ఉడకబెట్టని ఎగ్స్‌తో తయారు చేస్తున్నారని, దానివల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని మంత్రికి సదరు అధికారులు వెల్లడించారు. అయితే కేరళ రాష్ట్రంలో మయోనైజ్‌పై బ్యాన్ విధించిన విషయాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలోనూ బ్యాన్ విధించాలని మంత్రిని కోరారు. సమావేశంలో అధికారులతో చర్చించిన అనంతరం.. మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నిర్ణయాన్ని తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు.
అయితే.. రెండు రోజుల క్రితం హైదరాబాద్ నందినగర్‌లో జరిగిన వీక్లీ మార్కెట్‌లో మోమోస్ తిని.. ఓ మహిళ మృతి చెందారు. సుమారు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. చివరకు దిక్కు తోచని స్థితిలో ఆసుప త్రులపాలైన ఘటన అందరిలో ఆందోళనకు గురి చేసింది. అయితే.. ఈ వ్యవహారంలో పుడ్ పాయిజన్ వల్లే ఇలా జరిగిందని వైద్యులు తేల్చడం వల్ల.. అందుకు మయోనైజ్ కారణమని స్పష్టం చేశారు. ఇదే కాకుండా.. ఈ ఘటన కంటే ముందు సికింద్రాబాద్ పరిధిలో ఒక హోటల్‌లో శవర్మతో మయోనైజ్ తిన్న పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇలాంటి పలు ఘటనలు వెలుగు చూడటంతో మయోనైజ్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మయోనైజ్‌ను మండి బిర్యానీలు, కబాబ్, పిజ్జాలు, బర్గర్లు, శవర్మా, మోమోస్ వంటి ఆహార పదార్థాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే.. గుడ్డులోని పచ్చసొన, నిమ్మరసం, నూనె, ఉప్పుతో ఈ మయోనైజ్‌ను తయారు చేస్తారు. అయితే.. ఇది ఉడికించని పదార్థం కావడం వల్ల హానికర బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెందుతుందని వైద్యులు తేల్చారు. కాబట్టి దీనిని రాష్ట్ర ప్రభుత్వం నిషేదించినట్లు అధికారులు చెప్పుతున్నారు.
* * *
Leave A Comment